Chorus
వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర
నీకు‖ వందనమే ‖
Verse
యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ
ప్రభువుల ప్రభువునకు‖ వందనమే ‖
Verse
ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు
యెహోవా నీకు‖ వందనమే ‖
Verse
మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ
బరమేశ్వర నీకు‖ వందనమే ‖
Verse
రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు
భువనావన నీకు‖ వందనమే ‖
Verse
ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము
లర్పింతుము నీకు‖ వందనమే ‖