Chorus
వందనమో వందన మేసయ్య - అందుకొనుము మా దేవా
మాదు - వందన మందుకొనుమయా
Verse
ధరకేతించి ధరియించితివా - నరరూపమును నరలోకములో
మరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజా
నీకిదే వందన మందుకొనుమయా
Verse
పాపిని జూచి ప్రేమను జూపి - కరుణా కరముచే కల్వరి కడకు
నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ
ప్రేమకు సాటియే లేదిలలోన
Verse
ఉదయించితివా నన్నుద్ధరింప - ధరియించితివా దారుణ మరణము
దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా
దేవా హృదయార్పణ నర్పింతు
Verse
అనాధుండను నా నాథుండా - అండవై నాకు బండగ నుండు
అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు
క్రీస్తుండా స్తుతిపాత్రుండ - స్తుతించు
Verse
జగమును వీడి పరమున కరిగి - పరిశుద్ధాత్మను వరమును విరివిగ
నరులపై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా
రాజా నీకిదే నా స్తుతియాగం
Verse
పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో
ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు
క్షితినిన్ చేరి స్తుతింతు
Verse
స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడా - వర్ణనాతీతుడా ధవళవర్ణుడా
రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా
నీకిదే వందనమందుకొనుమయా