Verse
వందనము నీకే నా వందనము‖ 2x ‖
వర్ణనకందని నీకే నా వందనము‖ 2x వందనము ‖
Verse
నీ ప్రేమ నేనేల మరతు
నీ ప్రేమ వర్ణింతునా‖ 2x ‖
దాని లోతు ఎత్తునే గ్రహించి‖ 2x ‖
నీ ప్రాణ త్యాగమునే తలంచి‖ 2x వందనము ‖
Verse
సర్వ కృపానిధి నీవే
సర్వాధిపతియును నీవే‖ 2x ‖
సంఘానికి శిరస్సు నీవే‖ 2x ‖
నా సంగీత సాహిత్యము నీవే‖ 2x వందనము ‖
Verse
పరిశుద్ధమైన నీ నామం
పరిమళ తైలము వలె‖ 2x ‖
పరము నుండి పోయబడి‖ 2x ‖
పరవశించి నేను పాడెదను‖ 2x వందనము ‖
Verse
మృతి వచ్చెనే ఒకని నుండి
కృప వచ్చెనే నీలో నుండి‖ 2x ‖
కృషి లేక నీ కృప రక్షించెను‖ 2x ‖
కృతజ్ఞతార్పణలర్పింతును‖ 2x వందనము ‖
Verse
తండ్రియైన దేవునికే
కుమారుడైన దేవునికే‖ 2x ‖
పరిశుద్ధాత్మ దేవునికే‖ 2x ‖
వందన వందన వందనము‖ 2x వందనము ‖