Chorus
వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
Verse
నా జీవితపు ప్రముఖుడు ప్రభువే
నన్నేలెడు ప్రభు నా రాజాయనే
యుగుయుగ మహిమ ప్రభువునకే
పాడుచుండెదను భజియించెదను జయధ్వనుల జేతున్
Verse
నా ఆదర్శము మహిమయు తానే
తన యధికారము సర్వము నేలును
తన నామము బహు అద్భుతము
Verse
యెహోవా బహుస్తుతికి యోగ్యుడు
భక్తుల స్మరణ నీతియు నాయనే
మహాప్రభావము గలవాడు
Verse
బుద్దియు బలము జ్ఞానము ప్రభువే
తన నీతి బహు ఉన్నతమైనది
సైన్యముల కధిపతి నా తోడు