Chorus
వందనము నీకే - నా వందనము‖ 1x ‖
వర్ణనకందని నికే - నా వందనము‖ 2x ‖
వందనము నీకే - నా వందనము
Verse
నీ ప్రేమ నేనేల మరతున్ - నీ ప్రేమ వర్ణింతునా‖ 2x ‖
దాని లోతు ఎత్తు నే గ్రహించి‖ 2x ‖
నీ ప్రాణ త్యాగమునే‖ 2x ‖
వందనము నీకే - నా వందనము
Verse
సర్వ కృపా నిధి నీవే - సర్వాధిపతియును నీవే‖ 2x ‖
సంఘానికి శిరస్సు నీవే‖ 2x ‖
నా సంగీత సాహిత్యము నీవే‖ 2x ‖
వందనము నీకే - నా వందనము
Verse
మృతి వచ్చెనే ఒకని నుండి - కృప వచ్చెనే నీలో నుండి‖ 2x ‖
కృషి లేక నీ కృప రక్షించెను‖ 2x ‖
కృతజ్ఞతార్పణ లర్పింతును‖ 2x ‖
Verse
తండ్రియైన దేవునికే
కుమారుడైన దేవునికే‖ 2x ‖
పరిశుద్ధాత్మ దేవునికే‖ 2x ‖
వందన వందన వందనము‖ 2x వందనము ‖
Chorus
వందనము నీకే - నా వందనము
వర్ణనకందని నికే - నా వందనము‖ 2x ‖
వందనము నీకే - నా వందనము