Verse
వర్ణించలేను వివరించలేను
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు‖ 2x ‖
యేసయ్యా నీవు నాకు చేసిన మేలు‖ 2x ‖
Verse
పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు
పాడైపోయిన నన్ను బాగు చేసినావు‖ 2x ‖
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను‖ యేసయ్యా ‖
Verse
అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు‖ 2x ‖
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను‖ యేసయ్యా ‖
Verse
తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను
ఆదరించినావు ఓదార్చినావు‖ 2x ‖
ఏమని వర్ణింతును – ఋణం ఎలా తీర్చను‖ యేసయ్యా ‖