Verse
వర్ష ధారగా రావా నా యేసయ్యా
ఎండిపోయిన భూమి నేనయ్యా‖ 2x ‖
ఈ నేలలో పంట లేదయ్యా
నా మనస్సులో శాంతి లేదయ్యా‖ 2x ‖
వర్ష ధారగా రావా నా యేసయ్యా
ఫలింపజేయుమా పరమేశ్వరా‖ 2x ‖
Verse
పాపములన్ని పరిహరించుమా
భయములెల్ల పారద్రోలుమా‖ 2x ‖
యేసు నాథుడా నా రక్షకా‖ 4x ‖
నీదు కృపతో ఆదరించుమా‖ 2x వర్ష ‖
Verse
మనో వ్యధలను గుణ పరచుమా
తనువు గాయమెల్ల స్వస్థపరచుమా‖ 2x ‖
యేసు నాథుడా పరమ వైద్యుడా‖ 4x ‖
గాయములెల్ల స్వస్థపరచుమా‖ 2x వర్ష ‖