Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vasthunadosthunnado Oranna Raraaju Yesaiah

వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు యేసయ్యా

Vasthunadosthunnado Oranna Raraaju Yesaiah

Lyricist: Rev G Samuel
Chorus
వస్తున్నాడొస్తున్నాడో ఓరన్నా రారాజు యేసయ్యా
వస్తున్నాడూ, మన రక్శకుడేసయ్య వస్తున్నాడు
Verse
గర్జించు సింహముల గగనాన్ని చీల్చుకొని
కడభూర శబ్దముతో కదిలేను భువిపైకి
ఇహలోక రాజ్యాలను ఎదిరంచ ప్రభుయేసు‖ వస్తున్నాడు ‖
Verse
కాలము సంపూర్ణమాయె ప్రభురాకడ సమయమాయె
వ్యాధులన్నీ భాధలన్నీ వేదనకి సూచనాయె
కరువులు భూకంపాలు ప్రభురాకడ గురుతులాయె‖ వస్తున్నాడు ‖
Verse
అన్యాయము పెరిగిపోయె అక్రమాలు విస్తరించె
దొంగతనము దోపిడీలు దేశములో వాడుకాయే
ప్రతివాడు పాపానికి భానిసై ప్రభునెరుగని కాలమాయె‖ వస్తున్నాడు ‖
Verse
కంప్యుటరు కాలమాయె కరువులెరుగని రోజులాయె
సెల్ ఫొను మోజులో చెడిపోయెను సోదరా
బ్రతుకంత భారమాయె భాగుచేయు వాడు యెసు‖ వస్తున్నాడు ‖

Related Tags

Second ComingJudgmentEnd Times