Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vechiyumtini Nee Thattu Yesuvamemu

వేచియుంటిని నీ తట్టు యేసువమేము

Vechiyumtini Nee Thattu Yesuvamemu

Lyricist: Boola John
Chorus
వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి యుంటిమి నీ తట్టు
భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు
నీవైపు‖ వేచి ‖
Verse
కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో
గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్
స్తుతియింప‖ వేచి ‖
Verse
నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్
ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్
నమ్మబల్కిన మీకై‖ వేచి ‖
Verse
వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్
కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు
టెప్పుడొ యంచు‖ వేచి ‖
Verse
నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల
ద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల సంచరించుట యెపుడో‖ వేచి ‖
Verse
రంగుగు క్షయధనముల సంగడిజేరి భంగంబు పడుచుంటిమి
దొంగలుదోయని చిమ్మటకొట్టని తుప్పయిన పట్టని యక్షయ ధనమునకై‖ వేచి ‖

Related Tags

Second ComingHeavenly HopeWaiting