Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vechiyunnanu

వేచియున్నాను

Vechiyunnanu

Lyricist: Vijay Kondapuram
Verse
కొండలతట్టు నా కన్నులెత్తి
చూచున్నాను నీ వైపు
కరములు చాపి నీ వాగ్దానముకై
వేచియున్నాను నీ ముందు
Pre-Chorus
నా సహాయుడా నా సమర్ధుడా
నా సజీవుడా జయమిచ్చు జయశీలుడా
Chorus
కునుకవు నీవు నిదురించవు
నిరతము నా మొరలను ఆలకింతువు
Verse
నీ కార్యములు ఆశ్చర్యములు
నీ యోచనలు మహనీయము
రుచి చూచితిని నా బాల్యమునుండి
సాగిపోదును ఈ దృఢ విశ్వాసముతో
Pre-Chorus
నా సహాయుడా నా సమర్ధుడా
నా సజీవుడా జయమిచ్చు జయశీలుడా
Chorus
కునుకవు నీవు నిదురించవు
నిరతము నా మొరలను ఆలకింతువు
కునుకవు నీవు నిదురించవు
నిత్య నిబంధన స్థిరపరచెదవు
Bridge
నీతిని చీల్చి మార్గము చేసి
ఆరిన నేలపై నడిపిన దేవా
అగ్నిలో చేరి తోడుగ నడిచి
సజీవ సాక్షిగ నిలిపిన దేవా
Bridge
పర్వతములను తొలగించుము
నీ వాగ్ధానమును నెరవేర్చుము
Pre-Chorus
నా సహాయుడా నా సమర్ధుడా
నా సజీవుడా జయమిచ్చు జయశీలుడా
Chorus
కునుకవు నీవు నిదురించవు
నిరతము నా మొరలను ఆలకింతువు

Related Tags

FaithPrayerHope