Chorus
వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి
సమయముండగనే – ఆయనను వెదకుడి
కృపకాలముననే ఆయనను వెదకుడి‖ 2x వెదకు ‖
Verse
ఆయన మీకు - దొరుకు కాలమున
నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా
నీపై జాలితో - నిన్ను క్షమియించును‖ 2x ‖
తరుణము పోయినా- మరల రాదు‖ 2x వెదకు ‖
Verse
తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో
ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో
యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును‖ 2x ‖
తరుణము పోయినా - మరల రాదు‖ 2x వెదకు ‖
Verse
బాలుడైన యేసుని - జ్ఞానులు వెదికిరి
మగ్ధలేని మరియ - యేసుని వెదికెను
కన్నీటితో హన్నా - దేవుని వెదికెను‖ 2x ‖
తరుణము పోయినా - మరల రాదు‖ 2x వెదకు ‖
Verse
హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే
ఎస్తేరు వెదకి - తన వారిన్ రక్షించే
దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు‖ 2x ‖
తరుణము పోయినా - మరల రాదు‖ వెదకు ‖