Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vedana Tholaginchuvaadu Yese

వేదన తొలగించువాడు యేసే

Vedana Tholaginchuvaadu Yese

Lyricist: Joel Kodali
Verse
వేదన తొలగించువాడు యేసే
నా కన్నీటిని తుడచివేయును
క్రుంగిన హృదయపు లోతులలో
ఆనందము నింపునాయనే
శోదనలో జయమిచ్చువాడు యేసే
నా పక్షముగా పోరాడును
ప్రతికూల సమయము లెదురైన
ప్రతిక్షణమున తోడు ఆయనే
Chorus
యేసే నాకు ఆధారము
యేసే నాకు ఆదరణ
లోకమంత నన్ను విడచిన
ఓటమి భయము నాకు చూపిన
యేసు నన్ను విడువడు
Verse
లేరెవరు లోకములో
నన్ను ఇంతగా ప్రేమించేవారు
తల్లిదండ్రులు నన్ను విడచిన
బంధుమిత్రులు నన్ను కాదనిన
నరులెల్లరు నను మరచిన
ఆశ్రయమిచ్చువారు లేకున్న
యేసు ఎన్నడు మరువడు
తన చేయిని విడువడు
Chorus
వేదన తొలగించువాడు యేసే
నా కన్నీటిని తుడచివేయును
క్రుంగిన హృదయపు లోతులలో
ఆనందము నింపునాయనే
Verse
గాఢాంధకారములో
విహరించుచుంటిని
ముందున్న లోయలు కానక
వేగముగ సాగుచుంటిని
ఆ లోయలో అంచుకు చేరగా
యేసు నీవే నా ముందర నిలచి
నా పయనము గమనము మార్చి
నా ప్రాణము నిలిపితివి
Bridge
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
Verse
లేరెవరు లోకములో
నన్ను ఇంతగా ప్రేమించేవారు
సముద్రములు అడుగంటిన
పర్వతములు నేలరాలినను
నక్షత్రములు గతి తప్పిన
భూమి పునాదులు వణికినను
నేను యేసుని విడువను
తన ప్రేమను మరువను

Related Tags

ComfortJesusHope