Verse
వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో
నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో‖ వేఁడెద ‖
Verse
ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ
చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను‖ వేఁడెద ‖
Verse
నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు
పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు‖ వేఁడెద ‖
Verse
పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్
నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్‖ వేఁడెద ‖
Verse
నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్
నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్‖ వేఁడెద ‖
Verse
అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్
భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు‖ వేఁడెద ‖