Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Veeche Gaalullo

వీచే గాలుల్లో

Veeche Gaalullo

Verse
వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నా ప్రాణము – నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి – నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభు‖ 2x ‖
నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నేను జీవించలేను‖ 2x వీచే గాలుల్లో ‖
Verse
ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
కడవరకు కాపాడే నీవే నా దైవం
పోషించే నా తండ్రి నీవే ఆధారం
కరుణగల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జీవం
నీ వాక్యమే జీవ చైతన్యం‖ 2x నా ప్రియ యేసు ‖
Verse
ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
మా కోసమే నీవు మరణించి
పరలోకమే మాకు ఇచ్చావు‖ 2x నా ప్రియ యేసు ‖

Related Tags

PraiseWorshipDevotional