Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Veeche Gaalullo Prathiroopam Neeve

వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే

Veeche Gaalullo Prathiroopam Neeve

Chorus
వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవ నదిలా మము తాకు యేసయ్యా
నీవే నాప్రాణము నీవే నా సర్వము
నీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభు‖ 2x ‖
Chorus
నాప్రియ యేసు నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నేను జీవించలేను‖ 2x ‖
Verse
ప్రేమించే నా ప్రాణం నీవే నానేస్తం
కడవరకు కాపాడే నీవే నాదైవం
పోషించే నాతండ్రీ నీవే నా ఆధారం
కరుణ గల నీ మనసే నాకు చాలును
నీ మాటలే మాకు ఉజ్జివం
నీవాక్యమే జీవ చైతన్యం‖ 2x ‖
Verse
ప్రతి సమయం నేపాడే నీ ప్రేమగీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతినైవేద్యమై
నేవెళ్లే ప్రతిచోట చాటాలి నీప్రేమే
నీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి
మాకోసమే నీవు మరణించి
పరలోకమే మాకు ఇచ్చావు‖ 2x ‖

Related Tags

WorshipDevotionalJesus