Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Veenulaku Vindulu Chese Yesayya Su Charithra

వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర

Veenulaku Vindulu Chese Yesayya Su Charithra

Verse
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వేగిరమే వినుటకు రారండి
ఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి‖ వీనులకు ‖
Chorus
రండి… విన రారండి
యేసయ్య ఎవరో తెలిసికొన రారండి‖ 2x ‖
నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండి
మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి‖ 2x ‖
రండి…‖ వీనులకు ‖
Verse
రండి… వచ్చి చూడండి
యేసయ్య చేసే కార్యములు చూడండి‖ 2x ‖
నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి
శాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి‖ 2x ‖
రండి…‖ వీనులకు ‖
Verse
సృష్టి కర్తను మరచావు నీవు
సృష్టిని నీవు పూజింప దగునా‖ 2x ‖
భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండి
నిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి‖ 2x ‖
రండి…‖ వీనులకు ‖

Related Tags

GospelSalvationJesus