Verse
వీరుల మయ్యా జయ వీరుల మయ్యా మా వైరిఁ జంప
యుద్ధమాడు శూరుల మయ్యా‖ వీరుల ‖
Verse
మాంస లోక పిశాచి హింసపరచిన మము ధ్వంసముఁజేయ పై
బడిన ధ్వజము విడమాయా‖ వీరుల ‖
Verse
పరమ గురు వగు యేసు ప్రభువు నాజ్ఞను బహు త్వరగఁ
బ్రజకుఁ బయలుపర్చు భటుల మే మయా‖ వీరుల ‖
Verse
అతి దుష్ట ద్రోహులు మము వెతలఁ బెట్టిన నీ క్షితి సువార్త కొఱ
కొకింత సిగ్గు పడ మయా‖ వీరుల ‖
Verse
భూలోక నాధులు చాల పోరు సల్పిన మా వేలుపునకుఁ బ్రాణ
మైనఁ బెట్టువారము‖ వీరుల ‖