Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Velisindi Gaganaana O Vintha Thaara

వెలిసింది గగనాన ఓ వింత తార

Velisindi Gaganaana O Vintha Thaara

Lyricist: Bishop Daniel Kalyanapu
Verse
వెలిసింది గగనాన ఓ వింత తార
నిలిచింది పశులశాలపై ఆ వింత తార
తెలిపింది యేసుక్రీస్తు యేతెంచె ఈ ధర
మనుజాలికి దొరికెను మార్గం పరమును చేర
Chorus
హాపి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
హాపి క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
Verse
చీకటిలో మరణాంధకారములో
ఉన్నవారికై నీతిసూర్యుడుదయించే
ఆ నీతి సూర్యుడు నీలో ఉదయిస్తే
నీ చీకటంతయు నవ్వులమయం
ఆ దివ్యజ్యోతి నీలో ఉదయిస్తే
నీ పాపమంతయు అవ్వును దూరం
Verse
ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
పరిశోధన మాని పరిశుద్ధుని చేరిరి
విలువైన కానుకలు అర్పించి యేసుకు
ఆ రారాజును కీర్తించి పొగిడిరి
హృదయమనే కానుక యేసుకు అర్పిస్తే
ఆయన నీలోన ఉదయిస్తాడు

Related Tags

Christmas