Verse
వెళ్ళెదము కూడి వెళ్ళెదము
శ్రేష్ఠ దేశమును చేరుటకు - నీతి నివసించును అందున
Verse
భయమును కలిగి బ్రతికెదము - పరదేశులమని యెరుగవలె
ప్రవేశించ వలె విశ్రాంతిలో - తప్పిపోదుము మరచినచో
Verse
ప్రభువాజ్ఞలను పాలించుటకు - ప్రయాస పడెదము మనమిలలో
పదిలముగా అంతము వరకు - పడిపోకుండా చూచుకొందుము
Verse
ప్రభువు మన కప్పగించినవి - పట్టుకొని మనముండెదము
దుష్టుని బారిని తప్పించుకో - దోచుకొన నివ్వకు మకుటము
Verse
సుళువుగా ఉరియొడ్డు - ప్రతి పాపమున్ - సంపూర్ణముగను తొలగించుచు
సహనముతోడ పరుగెత్తుచు - స్వర్గ దేశము చేరవలెన్
Verse
సంపూర్ణత పొందసాగెదము - సమర్పించుకొని పూర్ణముగా
సహించిన కష్టదుఃఖములు - బహుగా ఫల మొందెదము