Verse
వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను
తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు
Verse
మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చును
మేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా
Verse
ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చి
తన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము
Verse
అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలో
సర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే
Verse
వాక్యము వర్ధిల్లి వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లు
సేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము
Verse
ఆత్మతో ప్రభుయింటిని కట్టి - దాని యందు ప్రభు మహిమనిండి
తన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను
Verse
సజీవ రాళ్ళతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లు
దేవా నీ హృదయానుసారులను - లేపమని వేడెదం