Verse
వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము
వుండెదం ప్రభుతోనే నిత్యము
పరలోక దేశము వుత్తమం
ఆ మనదేశం అతి వుత్తమం
Verse
తండ్రి కోరికయే మనకొక రాజ్యమివ్వ
లోకసృష్టి క్రితము యేర్పాటైన పట్టణం
Verse
అద్భుత నగరమది ప్రభు నిర్మించినది
దృఢమైన పునాది స్థిరపరచబడినది
Verse
పవిత్ర నగరమది నీతికి స్థానమది
పరమ స్వభావముతో నిర్మింపబడినది
Verse
నిరంత రాజ్యమది యుగంబు లుండునది
నిత్యముండెద రచ్చట యేర్పరచబడినవారు
Verse
ప్రభుని చూచెదము ఆనంద మొందెదము
ప్రభు సమానముగా మనముండెద మచట