Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Velpulalo Bahu Ghanuda Yesayya

వేల్పులలో బహు ఘనుడా యేసయ్యా

Velpulalo Bahu Ghanuda Yesayya

Lyricist: Bro Yesanna
Chorus
వేల్పులలో బహు ఘనుడా -యేసయ్యా
నిను సేవించువారిని - ఘనపరతువు
నిను ప్రేమించువారికి సమస్తము - సమకూర్చి జరిగింతువు
నీ యందు భయభక్తి గల వారికీ - శాశ్వత కృపనిచ్చెదవు
Verse
సుందరుడైన యోసేపును - అంధకార బంధువర్గాలలో
పవిత్రునిగ నిలిపావు - ఫలించెడి కొమ్మగ చేశావు
మెరుగుపెట్టి నను దాచావు - నీ అంబుల పొదిలో
ఘనవిజయమునిచ్చుట కొరకు - తగిన సమయములో
Verse
ఉత్తముడైన దావీదును - ఇరుకులేని విశాల స్థలములో
ఉన్నత కృపతో నింపావు - ఊహించని స్థితిలో నిలిపావు
విలువపెట్టి నను కొన్నావు - నీ అమూల్య రక్తముతో
నిత్య జీవమునిచ్చుట కొరకు - మహిమ రాజ్యములో
Verse
పామరుడైన సీమోనును - కొలతలేని ఆత్మాభిషేకముతో
అజ్ఞానము తొలగించావు - విజ్ఞాన సంపదనిచ్చావు
పేరుపెట్టి నను పిలిచావు - నిను పోలినడుచుటకు
చెప్ప శక్యము కాని ప్రహర్షముతో - నిను స్తుతించెదను

Related Tags

PraiseWorship