Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Velpulalovna Nivanti Devudu

వేల్పులలోన నీవంటి దేవుడు

Velpulalovna Nivanti Devudu

Chorus
వేల్పులలోన నీవంటి దేవుడు
జగమందున లేరెవ్వరు యుగమందున వేరెవ్వరు‖ 2x ‖
సర్వసృష్టికి కారణబూతుడా
సరిపోల్చలేను నీ సామర్ధ్యము‖ 2x ‖
వివరించలేను నీ కార్యములను‖ 2x ‖
అర్పించెద స్తుతి నైవేద్యము
జీవించేద యిలా నీకోసమే‖ 2x ‖
Verse
నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేసి
అవమానములను దీవెనకరముగా మార్చితివే‖ 2x ‖
లోకము ఏకమై ద్వేసించినను
నా పక్షమై నీవు నిలచియున్నావు‖ 2x ‖
Verse
శక్తికిమించిన పరిచర్యలకై నన్ను పిలిచి
ఎదుర్కొనలేని పరిస్థితిలో నన్ను బలపరచి‖ 2x ‖
కృప వెంబడికృప చూపుటకై
ఏరి కోరి నన్నుఎన్నుకొంటివి‖ 2x ‖
Verse
ఉన్నతమైన ఉపదేశములో నన్ను పెంచి
సారముకలిగిన సంఘములో నన్ను స్థిరపరచితివే‖ 2x ‖
నిలువరమైన నీరాజ్యముకై
వేచియుందును నీ రాకకొరకై‖ 2x ‖

Related Tags

PraiseWorshipDevotional