Chorus
వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని స్తోత్రింతును వెరువను
నేనిక నెవ్వరికిన్ వెలుగైన యేసే నా దుర్గము
Verse
అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన
యుగయుగంబుల నేలెడి ప్రభువు యఘముల బాపి నను వెలిగించును‖ వెలుగు ‖
Verse
నా దీపమును వెలిగించు ప్రభువే నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును
నా దోషము లెల్లను దన కాంతిలో నాదరముగ కడిగి రక్షించును‖ వెలుగు ‖
Verse
పలువిధ శోధనల్ నను జుట్టినను విలువగు సంపద లంతరించినను
వెలుగుదూత నాపై యురులొడ్డిన నలయక నిత్యము నడచెద వెల్గులో‖ వెలుగు ‖
Verse
తల్లిదండ్రులు విడచినగాని యుల్లము భీతిని భయమందినను ఎల్ల
ప్రజలు నను ద్వేషించినను ఎడబాయడునా ప్రియుడగు యేసు‖ వెలుగు ‖
Verse
క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తముగ గనుడి ప్రియులార
శాశ్వతంబగు రాజ్యము చేర సత్వరమాయన వెలుగును బొందరె‖ వెలుగు ‖