Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vendi bangaarukantey sreshtamainadhi

వెండి బంగారుకంటే శ్రేష్టమైనది

Vendi bangaarukantey sreshtamainadhi

Verse
వెండి బంగారుకంటే శ్రేష్టమైనది
మన బైబిలు దివ్యమైన మాట
జుంటి తేనేల కన్న మధురమైనది
మన యేసయ్య ప్రేమగల మాట
యేసయ్య మాట జీవపు ఊట
యేసయ్య మాట సత్యాల మూట
చదివి చదివి చదివి చదివి
ఆనందించుడి బహు సంతోషించండి
పరిశుద్ధ గ్రంధం పఠించి చూడు
వాక్యానుసారం గ్రహించి మెలుగు
చెప్పలేని మేలులెన్నో
అందుకొందువు నీవు ఆనందింతువు
సువార్త గ్రంధం సజీవ గ్రంధం
దైవానుగ్రంధం దివ్యానుబంధం
నిత్యము చదివి ప్రభుని కృపలో
నిలచియుందువు నీవు ఉల్లసింతువు
యేసయ్య నీ ధర్మశాస్త్రం
దినమెల్ల నాకదే ప్రాణం
వాక్యం వలన వెలుగు కలిగి
చీకటి పోవును నాలో చీకటి పోవును

Related Tags

FaithBibleWord Of God