Chorus
వెరువనేల మనసా క్రీస్తుని వేఁడవే నా మనసా యిరుకునఁ బడి
యెడు వేళలోఁ క్రీస్తుని చరణము చేరువ జేరిన సుఖ మది‖ వెరువ ‖
Verse
శోధన కాలమునఁ క్రీస్తుని బోధకు చెవి నిమ్మా సాధించెడు సా
తానుని వల మరి ఛేదించెడు నిఁకఁ బెదరకు‖ వెరువ ‖
Verse
పాపపు స్త్రీ వచ్చి పరిమళ తైలము తాఁ దెచ్చి పాప మెడలు నని
తనలో ననుకొని యేపున క్రీస్తుని నెలమి భుజించెను‖ వెరువ ‖
Verse
గ్రుడ్డివాడు నిలిచి మార్గము బడ్డ యేసుని బిలచి చెడ్డవాడనని
చేయివిడువకు మన దొడ్డ క్రీస్తు కందోయి నొసంగెను‖ వెరువ ‖
Verse
గాసి బడుచు రోగి యగు చెలి యాశచేత వచ్చి వాసిగ యేసుని
వస్త్రమంటి సుఖ వాసి యయ్యె ప్రభు యేసుని కృపచే‖ వెరువ ‖
Verse
లాజరుండు మృతుడై పడువే ళ సమాధికి వచ్చి లాజరా యని
బల్కరుణను బిలువఁగ రాజిల బ్రతికెను బ్రాణాన్వితుఁడై‖ వెరువ ‖
Verse
పరిసయ్యునిలోని భావము ప్రభు తాఁ గనుఁగొనుచుఁ తిరిగి పొమ్ము
నీ దురితము వెడలెను వెరువకు మని యాదరముగ బలికెను‖ వెరువ ‖