Verse
వేవేల దూతలతో కొనియాడబడుచున్న
నిత్యుడగు తండ్రి సమాధాన కర్త
బలవంతుడైన దేవా‖ వేవేల ‖
Verse
మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం
నే మరువలేను నా దేవా‖ 2x ‖
ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను‖ 2x ‖
ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను‖ 2x వేవేల ‖
Verse
మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు
మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు‖ 2x ‖
ఎంత వేదనైనా – ఎంత శోధనైనా‖ 2x ‖
మా కొరకు సిలువలో బలి అయినావు‖ 2x వేవేల ‖