Verse
వేయ్యేండ్లొక యుగమైనా గడిచింది క్షణమేగా
ప్రేమికుల మధ్య యుగమైనా గడిచిపోతుంది క్షణంగా
దూరమైతే క్షణమైనా భరియించె యుగమేగా
ఆకర్షణ ఉన్న చోట యుగమైనా గడచు క్షణంగా
ఆకర్షణ దూరమైతే క్షణమైనా గడచు యుగంగా
ఐన్స్టీన్ చెప్పాడా ఈసాపేక్ష సిద్ధాంతం
బైబిల్ చెప్పిందా ఆపేక్ష సిద్ధాంతం
క్రమం తప్పక చదవమన్నాడు బైబిల్నతడు
మహాశాస్త్రం నేర్చుకున్నాడు బైబిల్నుండతడు
దేశదేశాల మధ్య కాలమే వేరని నీకు తెలుసు
ముల్లోకాల మధ్య కాలమే వేరని నీకు తెలుసా
విశ్వకాలమే తెలియని నీకు దేవుని కాలమేం తెలుసు
ఇదే నిజం – అదే కదా దేవుని కాలరహస్యం
మానవ జీవితకాలం అంటే – కాలమే కాదని తెలుసుకో
తన దృష్టికి నీ ఆయుష్కాలం – గడిచిపోయినా క్షణకాలం
ఇరువదినాలుగుగంటల కాలమే – తనది కాదని తెలుసుకో
తన దృష్టికి సహస్ర కాలమైనా గడచిపోయినా దినకాలం
ప్రేమ విఫలమైతే భాదేలా ఉంటుందో నీకు తెలుసు
యుగయుగాలుగా తండ్రిపడే ఆవేదనెంతో తెలుసా
రక్తబంధమే తెలియని నీకు – ఆత్మ బంధమేం తెలుసు
అదే నిజం – ఇదే కదా దేవుని కాలరహస్యం
నీవులేని ఒక్కొక్షణం – ఒక్కో యుగమని తెలుసుకో
నీవు దూరమైతే క్షణమైనా – లెక్కలెన్నని యుగములే
నీవురానీ లోతైనా క్షణం – ఒక్కో యుగమని తెలుసుకో
నీవురావాలనే దినమంతా చాచివుంచాడు చేతులే