Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vidheyathake Ardhamu Cheppina

విధేయతకే అర్ధము చెప్పిన

Vidheyathake Ardhamu Cheppina

Verse
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా
విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా
అవిధేయత తొలగించుమయ్యా
నీ దీన మనస్సు కలిగించుమయ్యా‖ 2x విధేయతకే ‖
Verse
పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి‖ 2x ‖
సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి‖ 2x ‖
అధికముగా హెచ్చింపబడితివి‖ 2x అవిధేయత ‖
Verse
పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి
ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి‖ 2x ‖
శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి‖ 2x ‖
రక్షణకు కారకుడవైతివి‖ 2x అవిధేయత ‖

Related Tags

WorshipSacrificeObedienceHumility