Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Viduvani Devuda Nive Ma Manchi Yesayya

విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా

Viduvani Devuda Nive Ma Manchi Yesayya

Verse
విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా
ప్రేమించుటకు క్షమియించుటకు
రక్షించుటకు అర్హుడ నీవే‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Verse
నలువది సంవత్రరములు మా పితరుల నడిపిన దేవా
అరణ్య మార్గమైనా అన్నీ నీవైనావు‖ 2x ‖
జీవాహారమై ఆకలి తీర్చావు
కదిలే బండవై దాహము తీర్చావు‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
Verse
ఇత్తడి సర్పమువోలే పైకెత్తబడినావు
నిన్ను చూచినవారు ఆనాడు బ్రతికారు‖ 2x ‖
సిలువపై వ్రేలాడే నీ దరి చేరిన
జనులందరు నేడునిత్యము బ్రతుకుదురు‖ 2x ‖
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా

Related Tags

WorshipFaithJesus