Verse
విడువను నిను ఎడబాయనని నా
కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా
Verse
నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా‖ 2x ‖
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా‖ విడువను ‖
Verse
పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా‖ 2x ‖
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా‖ విడువను ‖
Verse
మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా‖ 2x ‖
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి‖ విడువను ‖
Verse
సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా‖ 2x ‖
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను‖ విడువను ‖