Verse
విడువవు నన్నిక ఎన్నడైననూ
పడిపోకుండా కాయు రక్షకా‖ 2x ‖
పడిపోవు వారెల్లరిని
లేపెడి వాడవు నీవే ప్రభు‖ 2x విడువవు ‖
Verse
ప్రభువా నీకవిధేయుడనై
పలు మారులు పడు సమయములలో‖ 2x ‖
ప్రేమతో జాలి దీన స్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి‖ 2x విడువవు ‖
Verse
ఆదాము హవ్వలు ఏదెనులో
ఆశతో ఆజ్ఞ మీరినను‖ 2x ‖
సిలువకు చాయగా బలినర్పించి
ప్రియముగా విమోచించితివి‖ 2x విడువవు ‖
Verse
మా శక్తియు మా భక్తియు కాదు
ఇలలో జీవించుట ప్రభువా‖ 2x ‖
కొల్లగా నీ ఆత్మను నొసగితివి
హల్లెలూయా పాడెదను‖ 2x విడువవు ‖