Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Viduvavu Nannika Ennadainanu Padipokunda Kaayurakshaka

విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా కాయురక్షకా

Viduvavu Nannika Ennadainanu Padipokunda Kaayurakshaka

Chorus
విడువవు నన్నిక ఎన్నడైనను
పడిపోకుండా కాయురక్షకా
పడిపోవు వారెల్లరిని
లేపెడి వాడవు నీవే ప్రభూ
Verse
ప్రభువా నీకవిధేయుడనై
పలుమారులు పడుసమయములో
ప్రేమతో జాలి దీనస్వరముతో
ప్రియుడా నను పైకెత్తితివి
Verse
ఆదాము హవ్వలు ఏదేనులో
ఆశతో ఆజ్ఞ మీరినను
సిలువకు ఛాయగ బలి నర్పించి
ప్రియముగా విమోచించితివి
Verse
మోషేకు నీ దర్శనమిచ్చి
నీ ప్రజలను నడిపించుటకై
సాకులు చెప్పిన విడువక తననే
నాయకునిగ నియమించితివి
Verse
స్వంత తలంపున దావీదు
మందసమును తెచ్చునప్పుడు
ఉజ్జా మరణముచే దావీదు
హృదయమును కదిలించితివి
Verse
నీమాటలు వినక యోనా
తర్షీషుకు తరలినపుడు
సముద్రములో మునుగుచుండ
చేపద్వారా దరిచేర్చితివి
Verse
నిన్నెన్నడు యెడబాయనని
నిక్కముగ పేతురు పలికె
ముమ్మారు బొంకినను విడువక
ప్రేమతోను రక్షించితివి
Verse
మా శక్తియు మా భక్తియు కాదు
ఇలలో జీవించుట ప్రభువా
కొల్లగ నీ యాత్మను నొసగితివి
హల్లెలూయ పాడెదను

Related Tags

RedemptionGraceProtection