Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vijaya Geethamu Manasaara

విజయ గీతము మనసార

Vijaya Geethamu Manasaara

Verse
విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు‖ 2x ‖
పునరుత్తానుడ నీవే
నా ఆలాపన నీకే నా ఆరాధన‖ 2x ‖
Verse
ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
పుటము వేసితివే నీ రూపము చూడ నాలో‖ 2x ‖
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో‖ 2x విజయ ‖
Verse
ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో‖ 2x ‖
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది‖ 2x విజయ ‖
Verse
నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో‖ 2x ‖
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ‖ 2x విజయ ‖

Related Tags

PraiseWorshipVictory