Verse
విజయ గీతముల్ పాడరే
క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే‖ 2x ‖
వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ
నిజ కుమారుని నామమున్
హృదయములతో – భజన జేయుచు నిత్యమున్‖ విజయ ‖
Verse
మంగళముగ యేసుడే
మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను
నింగిన్ విడిచి వచ్చెను
శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను
రంగు మీరగదన – రక్త బలము వలన
పొంగు నణగ జేసెను
సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను‖ విజయ ‖
Verse
పాపముల్ దొలగింపను
మనలను దన స్వ – రూపంబునకు మార్పను
శాపం బంతయు నోర్చెను
దేవుని న్యాయ – కోపమున్ భరియించెను
పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు
పాప యాగము దీర్చెను
దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను‖ విజయ ‖
Verse
సిలువ మరణము నొందియు
మనలను దనకై – గెలువన్ లేచిన వానికి
చెలువుగన్ విమలాత్ముని
ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి
కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని
సిలువ మోయుచు నీ కృపా
రక్షణ చాల విలువ గలదని చాటుచు‖ విజయ ‖