Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vijaya Seeludaa Naa Yesayya

విజయశీలుడా నా యేసయ్యా

Vijaya Seeludaa Naa Yesayya

Lyricist: Pr Martin
Chorus
విజయశీలుడా నా యేసయ్యా
స్తుతుల సింహాసనాసీనుడా‖ 2x ‖
మృతుడవైతివి తిరిగి లేచితివి
యుగయుగములకు సజీవుడవైతివి‖ 2x ‖
అప: ధీరుడా బలసౌర్యుడా
వీరుడా జయవీరుడా‖ 2x ‖
Verse
పాపములోనే జన్మించితిని
జీవితమంతయు విషముగా మారెను‖ 2x ‖
నను రక్షించుటకై తండ్రిని విడచి
సిలువలో నాకై మరణించినావే‖ 2x ‖
Verse
నీ రూపము నాలో రూపించుటకై
నీ రక్తము చేత నను కడిగితివి‖ 2x ‖
నీ కిష్టమైన పాత్రగాచేయ
చేజారనివ్వక సారెపై నిలిపితివి‖ 2x ‖
Verse
రక్షణ పాత్రను చేబుచ్చుకొని
పరిశుద్ధతను కాపాడుకొందును‖ 2x ‖
తేజోవాసుల స్వాస్థ్యము కొరకై
నా జయ జీవితం నీవుకోరుకొంటివి‖ 2x ‖

Related Tags

PraiseWorshipVictory