Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vijayageethamul Paadare Kreesthunaku

విజయగీతముల్ పాడరే క్రీస్తునకు

Vijayageethamul Paadare Kreesthunaku

Lyricist: Allari Pedaveeraswamy
Chorus
విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ పాడరే
వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్
హృదయములతో భజన జేయుచు నిత్యమున్‖ విజయ ‖
Verse
మంగళముగ యేసుఁడే మనకు అక్షణ శృంగమై మరి నిల్చెను
నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు
మీరఁగఁదన రక్తబలము వలనఁ పొంగు నణఁగఁజేసెను సాతానుని
బల్ క్రుంగ నలిపి చీల్చెను‖ విజయ ‖
Verse
పాపముల్ దొలఁగింపను మనలను దన స్వ రూపంబునకు మార్పను
శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరియించెను
పాప మెరుఁగని యేసు పాపమై మనకొరకు పాపయాగము దీర్చెను
దేవుని నీతిన్ ధీరుఁడై నెరవేర్చెను‖ విజయ ‖
Verse
సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన వానికి
చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ జేసిన వానికిఁ
కొలువుఁజేతుమెగాని ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా
రక్షణ చాల విలువ గలదని చాటుచు‖ విజయ ‖

Related Tags

PraiseSalvationVictory