Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vijayambu Vijayambu Vijayambu Maa Yesa

విజయంబు విజయంబు విజయంబు మా యేస

Vijayambu Vijayambu Vijayambu Maa Yesa

Lyricist: John Francis Spencer
Chorus
విజయంబు విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువు
గెల్చి నేఁడు వేంచేసె యజమానుఁ డెల్ల ప్ర యాసము లెడఁబాప
స్వజనుల రక్షింప సమసె సిలువమీఁద‖ విజయంబు ‖
Verse
విజయంబు విజయంబు విజయంబు మానవుల వృజిన నివృత్తిని
విభుఁ డొనరింపన్ గుజనులచే నతఁడు క్రూర మరణము నొంది విజిత
మృత్యువు నుండి విజయుండై వేంచేసె‖ విజయంబు ‖
Verse
విజయంబు విజయంబు విజయంబు మా యేసు భుజము మీఁదను
మోయుఁ బరిపాలనంబు కుజము మీఁదను బ్రాణ త్యజనము జేసెను
ధ్వజము మోయుచు సిల్వ పాప మోడింతము‖ విజయంబు ‖
Verse
విజయంబు విజయంబు విజయం బిఁకను మా క పజయము కాకుండఁ
బ్రభు యేసు క్రీస్తు సుజనత్వమున వైరి వ్రజము గెల్వఁగఁజేసి
నిజముగఁ బరలోక నిలయంబులో నిల్పు‖ విజయంబు ‖
Verse
విజయంబు విజయంబు విజయం బనెడి పాట నిజభక్తితో మనము
నేర్చిన వాని భజియించుదము భూన భములు తాఁ బాలించు అజిత
జీవ ప్రదుఁ డమరత్వ మిడు మనకు‖ విజయంబు ‖

Related Tags

VictoryResurrectionEaster