Verse
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను‖ 2x ‖
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి‖ 2x విజయశీలుడా ‖
Verse
అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు –‖ 2x ‖
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు‖ 2x ‖
నిత్యానందము కలిగించె నీ
శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి‖ 2x విజయశీలుడా ‖
Verse
ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు‖ 2x ‖
అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు‖ 2x ‖
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా‖ 2x విజయశీలుడా ‖
Verse
ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు –‖ 2x ‖
అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు‖ 2x ‖
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు‖ 2x విజయశీలుడా ‖