Verse
విజయుండు క్రీస్తు ప్రభావముతో
ఘనవిజయుండాయెను
సాతానుని తలను చితుక ద్రొక్కెను
సదా రాజ్యమేలును
Verse
ఓ మరణమా నీ ముల్లు యెక్కడ?
ఓ సమాధి నీ విజయమెక్కడ?
సిలువ శక్తితో విరుగగొట్టెను
విజయుండు సర్వంబులో
Verse
యూదా గోత్రంపు సింహమాయనే
గ్రంథమును విప్ప యోగ్యుండు తానే
ఏడు ముద్రలను విప్పెడివాడు
యోగ్యుండు సర్వమందు
Verse
ఆయనే శిరస్సు తన సంఘమునకు
మృతులలో నుండి ప్రథముడై లేచె
మన ప్రభుయేసే మరణమును గెల్చె
సర్వములో ప్రధానుడై
Verse
సింహాసనమందు వున్న మన ప్రభువే
పద్మరాగముల మరకతముల బోలి
సూర్యకాంతివలె ప్రకాశించెను
జయమని పాడెదము
Verse
ఆయన యెదుట సాగిలపడి
నాలుగు జీవులు పెద్దలందరును
సర్వసృష్టికి దేవుండవని
ఆరాధించి మ్రొక్కిరి
Verse
క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు
విజయమునిచ్చె తన ద్వారా మనకు
అధిక విజయము మనకిచ్చు ప్రభువే
అందరిలో అతిశ్రేష్టుండు