Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vilapinthuva Nehemyavale Vilapinthuva Ezraavale

విలపింతువా నెహెమ్యావలె విలపింతువా ఎజ్రావలె

Vilapinthuva Nehemyavale Vilapinthuva Ezraavale

Chorus
పల్లవి: విలపింతువా నెహెమ్యావలె? - విలపింతువా ఎజ్రావలె?‖ 2x ‖
కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో
పడిపోయిన ప్రభుని యింటిని గూర్చి విలపింతువా?‖ 2x ‖
Verse
ఆత్మీయ గ్రహింపు లేకయే
ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి
ఎటుచూచిన ప్రభు యిల్లు పడిపోయెను
ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి
Verse
అగ్నిచే కాల్చబడిన గుమంబులన్
పడిపోయిన ప్రాకారమున్
పునహ్నిర్మించి నిందను తొలగించెదమా?
ప్రభు హస్తంబుతోడుండగన్
Verse
ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో
ఆత్మకలిగించు ఐక్యతతో
ఒకరినొకరు క్షమించి, సహించుచూ
ప్రభు ప్రత్యక్షత పొందెదమా?
Verse
నెహెమ్యావలె హృదయంబుల చింపుకొని
పశ్చాత్తాపముతో ప్రభుని చేరి
ఒక చేత ఆయుధము పట్టుకొని
ప్రభుయింటిని కట్టెదమా

Related Tags

PrayerRepentanceDedication