Verse
విలువైన నీ కృప నాపై చూపి – కాచావు గత కాలము
ఎనలేని నీ కృప నాపై ఉంచి – ఇచ్చావు ఈ వత్సరం
దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో
ప్రతి దినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలో
నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా‖ 2x విలువైన ‖
Verse
గడచినా కాలమంతా తోడైయున్నావు
అద్భుతాలు ఎన్నో చేసి చూపావు‖ 2x ‖
లెక్కించ లేని మేలులతో తృప్తి పరిచావు‖ 2x ‖
నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు‖ 2x నా జీవిత ‖
Verse
సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
నూతన కార్యాలు ఎన్నో చేశావు‖ 2x ‖
సంవత్సరమను నీ దయా కిరీటం ధరింప చేశావు‖ 2x ‖
నా దినములు పొడిగించి నీ కృపలో దాచావు
మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు‖ నా జీవిత ‖