Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Viluvaina Premalo Vanchana Ledu Kalvari Prema

విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో

Viluvaina Premalo Vanchana Ledu Kalvari Prema

Verse
విలువైన ప్రేమలో వంచన లేదు కల్వరి ప్రేమలో కల్మషం లేదు
మధురమైన ప్రేమలో మరణం లేదు శాశ్వత ప్రేమలో శాపం లేదు
యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు అద్భుత ప్రేమలో అరమరిక లేదు
Verse
వాడిగల నాలుక చేసిన గాయం శోధన సమయం మిగిల్చిన భారం
అణిచివేయబడెను ఆశ్చర్య ప్రేమలో‖ 2x ‖
నిలువ నీడ దొరికెనె నిజమైన ప్రేమలో‖ 2x ‖
Verse
నా దోషములను మోసిన ప్రేమ నాకై సిలువను కోరిన ప్రేమ
పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ‖ 2x ‖
ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ‖ 2x ‖

Related Tags

GraceCalvaryGods Love