Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Viluvainadi Nee Aayushkaalam

విలువైనది నీ ఆయుష్కాలం

Viluvainadi Nee Aayushkaalam

Verse
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం‖ 2x ‖
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం‖ 2x విలువైనది ‖
Verse
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము‖ 2x ‖
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము‖ 2x విలువైనది ‖
Verse
మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము‖ 2x ‖
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము‖ 2x విలువైనది ‖

Related Tags

LifeStewardshipReflectionTime