Verse
విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా‖ 2x ‖
సమయము పోనివ్వక సద్భక్తితో
సంపూర్ణతకై సాగెదము‖ 2x విలువైనది ‖
Verse
క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల‖ 2x ‖
గొర్రెపిల్లతొ కలిసి
సీయోను శిఖరముపై నిలిచెదము‖ 2x విలువైనది ‖
Verse
శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల‖ 2x ‖
సర్వాధికారియైన
ప్రభువుతో కలిసి ఏలెదము‖ 2x విలువైనది ‖
Verse
క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొందుటకు‖ 2x ‖
సమర్పణ కలిగి
పరిశుద్దతలో నిలిచెదము‖ 2x విలువైనది ‖