Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vimala Hrudaya Mimmu Vidithambu Ninu

విమల హృదయ మిమ్ము విదితంబు నిను

Vimala Hrudaya Mimmu Vidithambu Ninu

Lyricist: Alfred Thyagaraju Pamar
Chorus
విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ గొల్వ యేసునాధా నీదు
విమల రక్తము చేత విశదమౌ యెద నిమ్ము విశ్వనాధా‖ విమల ‖
Verse
అణఁకువ క్షమశాంత మధికముగ నాకిమ్ము ఆత్మనాధా నీకుఁ
బ్రణుతమౌ నా యెద ప్రభునిపీఠము జేయు మాత్మనాధా‖ విమల ‖
Verse
నీ చిత్తమే యంచు నీ పాదములఁ బట్టి నిల్చియుందు నిండు
నికరమౌ ప్రకటమౌ సుకరహృదయ మిమ్ము మేసునాధా‖ విమల ‖
Verse
భయభక్తు లలరెడు భావంబు నా కిమ్ము జీవనాధా నన్ను లయ
జీవములయందు జయశాలినిగఁ జేయు మేసునాధా‖ విమల ‖
Verse
పరిశుద్ధ హృదయంబు పరమేశ నా కిమ్ము ధరణిమీఁద నన్ని
తరుణములను నాకా దరణ మీవే యంచుఁ దలఁప నాధా‖ విమల ‖
Verse
నీ రూపము నిమ్ము నినుఁ బోలి నేనుండ నిత్యనాధా నీదు
సారూప్య మెదమీద సంపూర్తిగా వ్రాయు సత్యనాధా‖ విమల ‖
Verse
ప్రేమపూరిత హృదయ మేమరక నా కిమ్ము ప్రేమనాధా యెంతో
ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకిమ్ము క్షేమనాధా‖ విమల ‖

Related Tags

HolinessPrayerDevotion