Verse
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే‖ 2x ‖
Chorus
ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే‖ 2x ‖
Verse
ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన‖ 2x ‖
ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ‖ ఆనందమే ‖
Verse
నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా‖ 2x ‖
ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ‖ ఆనందమే ‖
Verse
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే
సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే‖ 2x ‖
ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం
ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే‖ 2x ‖