Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vina Rammu Yaesu Naadhuda Naa Manavi

విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి

Vina Rammu Yaesu Naadhuda Naa Manavi

Lyricist: Jonaya Bardar
Chorus
విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు ఘన మైన నీదు
నెనరుచే ననుఁ గావు మెప్పుడు‖ విన రమ్ము ‖
Verse
ఎక్కడిద్దఱు ముగ్గురు నీ యొక్క పేరటన్ జేరు టెక్కడో నే నక్కడ కే
తెంతు నంటివి‖ విన రమ్ము ‖
Verse
మఱి యెవరు దిక్కు ధరణిలోన వేఱు లేరుగా దుర్నరుల కెల్లఁ
దెరవుఁ దెల్పి నావు నీవెగా‖ విన రమ్ము ‖
Verse
మరణ మైతి వాహాహా నా కొరకు సిల్వపై నీ కరుణ కల్గె నెంత యీ
దు రాత్ముని నాపై‖ విన రమ్ము ‖
Verse
సకలంబు నీద టంచు మదిని సంతసించెద వే ఱొకని కించు కంతయైన
నుర్వి లేదుగా‖ విన రమ్ము ‖
Verse
కోరితి నినుదారిగ నను దూరపర్చకు నీ కూరిమి నా కొసఁగి
నడుపు మరణావధికి‖ విన రమ్ము ‖
Verse
వినయంబు సద్గుణంబు చిత్త ముననుఁ గూర్పవే ఘన మైన నీతి
యనుభవంబుఁ గలుగఁ జేయవే‖ విన రమ్ము ‖
Verse
దేవ దేవ రావె నిన్ను సేవఁ జేయుదు ననుఁ బావనునిగఁ జేయవె
నేఁ పాప నరుఁడను‖ విన రమ్ము ‖

Related Tags

WorshipDevotionalPrayer