Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Vinarandi Naa Priyuni Visheshamu

వినరండి నా ప్రియుని విశేషము…

Vinarandi Naa Priyuni Visheshamu

Verse
వినరండి నా ప్రియుని విశేషము…
Verse
వినరండి నా ప్రియుని విశేషము
నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు‖ 2x ‖
నా ప్రియుని నీడలో చేరితిని
ప్రేమకు రూపము చూసితిని‖ 2x ‖
ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
తనువంతా పులకించి మహదానందమే‖ వినరండి ‖
Verse
మహిమతో నిండిన వీధులలో
బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో‖ 2x ‖
జతగా చేరెదను ఆ సన్నిధిలో
కురిసె చిరుజల్లై ప్రేమామృతము
నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
జతగా చేరెదను ఆ సన్నిధిలో
నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
కన్నీరు తుడిచేది నా ప్రభువే‖ వినరండి ‖
Verse
జగతికి రూపము లేనప్పుడు
కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు‖ 2x ‖
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
కృపన్ జయధ్వనితో కీర్తించెదను
నా ప్రభు యేసు చెంతన చేరెదను
స్తుతినే వస్త్రముగా ధరించుకొని
నా ప్రభు యేసు చెంతన చేరెదను
యుగమొక క్షణముగ జీవింతును‖ వినరండి ‖
Verse
తలపుల ప్రతి మలుపు గెలుపులతో
నిలిచె శుద్ధ హృదయాల వీరులతో‖ 2x ‖
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
ఫలము ప్రతిఫలము నే పొందుకొని
ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
నా ప్రియుని విడువను నేనెన్నడు‖ వినరండి ‖

Related Tags

WorshipDevotionalJesus