Chorus
వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల
కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద‖ వినరయ్య ‖
Verse
పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన
దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్‖ వినరయ్య ‖
Verse
భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు
దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్‖ వినరయ్య ‖
Verse
అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు
మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్‖ వినరయ్య ‖
Verse
మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన
పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్‖ వినరయ్య ‖
Verse
తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో
ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్‖ వినరయ్య ‖